Please add some widget in Offcanvs Sidebar
Partner with us to make a greater impact. Our corporate sponsorship program offers businesses the opportunity to support our mission while gaining visibility and fulfilling corporate social responsibility goals.
The Telangana Poosala Sankshema Samithi (TPSS) is a voluntary organization founded on May 15, 2021, with the motto "For Us, By Us." It's registered under Regd. No. 1261/2021.
తెలంగాణ పూసల సంక్షేమ సమితి (TPSS)అనేది "మన కోసం-మనం"అనే నినాదంతో 2021 మే 15న స్థాపించబడిన ఒక స్వచ్ఛంద సంస్థ. ఇది 2021లో రిజిస్టర్ అయింది (రిజి. నెం. 1261/2021).
TPSS aims to support the underprivileged members of the Poosala community by creating awareness and fostering empowerment regarding educational, employment, health, social, and political initiatives from government and other organizations. Their goal is to instill confidence and a sense of belonging in the community.
పూసల కులంలో ఉన్న నిరుపేదలకు అండగా నిలబడటమే TPSS ప్రధాన లక్ష్యం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ సామాజిక, స్వచ్ఛంద సంస్థలు అందించే విద్యా, ఉద్యోగ, ఆరోగ్య, సామాజిక, రాజకీయ కార్యకలాపాలపై కులస్థులకు అవగాహన కల్పించి, వారిలో చైతన్యం నింపి, "మేమున్నాం"అనే భరోసా కల్పించడం.
The organization was established by Sri Podila Ajeya Babu and Sri Sheni Venkatesham.
శ్రీ పొదిల అజేయ బాబుమరియు శ్రీ షేని వెంకటేశంఈ సంస్థ ఆవిర్భావానికి ప్రధాన కారకులు.
TPSS's financial resources primarily come from:
• Membership Fees: An admission fee of Rs. 5,000/- and a monthly contribution of Rs. 500/- from its 36 members.
• Donors: Benevolent individuals who provide voluntary contributions in cash or kind.
• Chits/Pooled Funds: Monthly chits of Rs. 10,000/-, Rs. 5,000/-, and Rs. 25,000/- involving 20-25 compassionate members.
TPSS ఆర్థిక వనరులు ప్రధానంగా కింది వాటి నుండి లభిస్తాయి:
• సభ్యుల చందాలు: 36 మంది సభ్యులు ప్రవేశ రుసుము కింద రూ. 5,000/- చెల్లించి, ప్రతినెలా రూ. 500/- విరాళం అందిస్తారు.
• దాతలు:పారదర్శక సేవలను చూసి స్ఫూర్తి పొంది అనేక మంది దాతలు స్వచ్ఛందంగా నగదు రూపంలో లేదా వస్తు రూపంలో విరాళాలు అందిస్తారు.
• చీటీలు: 20-25 మంది సభ్యులతో ప్రతినెలా రూ. 10,000/-, రూ. 5,000/-, రూ. 25,000/- చొప్పున నడిచే చీటీల ద్వారా.
TPSS emphasizes that every rupee is utilized with transparency, accountability, and good intent, reaching deserving beneficiaries without any waste. Instead of directly accepting cash donations, contributions are requested to be deposited into a joint account at Axis Bank in the name of TELANGANA POOSALA SANKSHEMA SAMITHI (TPSS).
TPSS ప్రతి పైసాను పారదర్శకంగా, జవాబుదారీతనంతో, సదుద్దేశంతో వినియోగిస్తుంది. వచ్చిన విరాళాలను నేరుగా తీసుకోకుండా, TELANGANA POOSALA SANKSHEMA SAMITHI (TPSS)పేరిట యాక్సిస్ బ్యాంక్లోతెరిచిన జాయింట్ అకౌంట్లో జమ చేయమని అభ్యర్థిస్తారు.
TPSS accepts donations not only from Poosala community members within India but also from those living abroad, and even from non-Poosala community members.
TPSS కేవలం మన దేశంలోని పూసల కుల సభ్యుల నుండే కాకుండా, విదేశాలలో ఉన్న కుల సభ్యుల నుండి, అలాగే పూసల కులేతర సభ్యుల నుండి కూడా విరాళాలనుస్వీకరిస్తుంది.
TPSS offers a range of service programs, including:
• Health Support: Providing financial assistance for medical needs, and essential items like medicines, wheelchairs, and oxygen concentrators. They also provide financial assistance for funeral rites in unfortunate cases. A "Health Committee" of seven members examines applications for assistance.
• Educational Support: Formulating guidelines for a "TPSS Credit Cooperative Society" and providing financial assistance to students for higher education (Civil Services, Groups, Medical, Engineering).
• Community Welfare: Honoring individuals who have excelled in various fields (education, employment, business, technology, culture, politics).
TPSS ఈ కింది రకాల సేవా కార్యక్రమాలను అందిస్తుంది:
• ఆరోగ్య సహాయం:ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సహాయం, మందులు, వీల్ చైర్, ఆక్సిజన్ కాన్సంట్రేటర్, వంట సామాగ్రి వంటివి అందజేయడం. ఆరోగ్య కమిటీ ద్వారా దరఖాస్తులను పరిశీలిస్తారు. సహాయం అందకముందే మరణించిన వారి కుటుంబాలకు కర్మకాండల నిమిత్తం కూడా ఆర్థిక సహాయం అందిస్తారు.
• విద్యా సహాయం:"TPSS పరపతి సహకార సంఘం"విధివిధానాలను రూపొందిస్తుంది. సివిల్స్, గ్రూప్స్, మెడికల్, ఇంజనీరింగ్ వంటి రంగాలలో చదువుతూ ఖర్చులు భరించలేని వారికి ఆర్థిక సహాయం అందిస్తుంది.
• కుల సంక్షేమం:విద్యా, ఉద్యోగ, వ్యాపార, సాంకేతిక, సాంస్కృతిక, రాజకీయ తదితర రంగాలలో ప్రతిభ చాటిన వారిని సన్మానించడం.
As of May 23, 2025, TPSS has provided financial assistance to 223 beneficiaries, disbursing a total of Rs. 15,77,000/-.
2025 మే 23 వరకు TPSS నుండి 223 మంది లబ్ధిదారులుఆర్థిక సహాయం పొందారు. ఇప్పటివరకు TPSS సంస్థ లబ్ధిదారులకు రూ. 15,77,000/-నిధులను విడుదల చేసింది.
Initially established by Sri Panniru Satish Kumar, the website tpss.in is now managed and updated by the daughters of Swargiya Smt. Lakkarajula Girija Subuddhi – Krishna, Kanthi, and Kiranalu.
మొదట శ్రీ పన్నీరు సతీష్ కుమార్ అందించినప్పటికీ, ప్రస్తుతం tpss.inవెబ్సైట్ను స్వర్గీయ శ్రీమతి లక్కరాజుల గిరిజా సుబుద్ధి గారి కూతుళ్ళు – కృష్ణ, కాంతి, కిరణాలు – మార్పులు, చేర్పులతో నిర్వహిస్తున్నారు.
Every person born into the Poosala community is eligible to take an active role. TPSS cordially invites any like-minded, enthusiastic, and selflessly willing members from Villages, Mandals, Districts, Cities, States, National, and International levels to offer their services, provided they possess discipline and a selfless spirit of service.
పూసల కులంలో జన్మించిన ప్రతి ఒక్కరూ TPSS బహుముఖ కార్యక్రమాలలో చురుకైన పాత్ర వహించడానికి అర్హులే. గ్రామ, మండల, జిల్లా, పట్టణ, రాష్ట్ర, దేశ, విదేశ స్థాయిలో ఉంటున్న 'లైక్-మైండెడ్' సభ్యులెవరైనా తమ సేవలను అందించడానికి ఉత్సాహంగా, నిస్వార్థంగా ముందుకు రావాలనుకునే వారిని TPSS సాదరంగా ఆహ్వానిస్తుంది. అయితే, క్రమశిక్షణతో కూడిన నిస్వార్థ సేవా తత్పరత కలిగి ఉండాలి.
Yes, donations made to the TPSS welfare organization are eligible for income tax exemption under Section 80G of the Income Tax Act.
మీరు TPSS సంక్షేమ సంస్థకు ఇచ్చే విరాళాలపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80Gకింద పన్ను మినహాయింపు ఇవ్వబడును..
Donations made under Section 80G are eligible for a 50% exemption.
సెక్షన్ 80G కింద ఇచ్చే విరాళాలపై 50% మినహాయింపు లభించును....
• Cash: You can claim exemption for cash donations up to Rs. 2,000.
• Non-cash methods (Cheque, Demand Draft, Online Transfer): For amounts exceeding Rs. 2,000, it is mandatory to make donations through non-cash methods.
• In-kind donations: Donations made in kind (e.g., medicines, cooking supplies) are not eligible for tax exemption under Section 80G.
• నగదు రూపంలో:రూ. 2,000 వరకు నగదు విరాళాలపై మినహాయింపు పొందవచ్చు.
• నగదు కాకుండా ఇతర రూపాల్లో (చెక్, డిమాండ్ డ్రాఫ్ట్, ఆన్లైన్ బదిలీ):రూ. 2,000 కంటే ఎక్కువ మొత్తాలకు నగదు కాకుండా ఇతర రూపాల్లో విరాళాలు ఇవ్వడం తప్పనిసరి.
• వస్తు రూపంలో (kind) ఇచ్చే విరాళాలపై (ఉదాహరణకు, మందులు, వంట సామాగ్రి వంటివి) 80G కింద పన్ను మినహాయింపు లభించదు.
Donors can claim this exemption when filing their Income Tax Returns (ITR). It is crucial to obtain a proper receipt from TPSS for this purpose. This receipt will contain important details such as the organization's registration number, PAN number, date of donation, and the amount donated.
దాతలు తమ ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేసేటప్పుడు ఈ మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. దీని కోసం TPSS నుండి సరైన రసీదు (receipt) పొందడం ముఖ్యం. ఈ రసీదులో సంస్థ రిజిస్ట్రేషన్ నంబర్, పాన్ నంబర్, విరాళం ఇచ్చిన తేదీ, మొత్తం వంటి వివరాలు ఉంటాయి.. .